You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
సిరియాలో రసాయన దాడి జరిగిన నేపథ్యంలో మళ్లీ రసాయన ఆయుధాలపై చర్చ మొదలైంది.
నిజానికి రసాయన ఆయుధాలకు వందేళ్లకు పైగా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన రసాయన ఆయుధం.. క్లోరిన్.
మనుషులను అస్వస్థతకు గురిచేయడానికే దాన్ని తయారు చేశారు. కానీ అది చాలామంది ప్రాణాలను తీసింది.
1915లో రెండో ఈప్రస్ యుద్ధంలో క్లోరిన్‌ను తొలిసారి ప్రయోగించారు. యుద్ధంలో అది కొత్త ఆయుధం కావడంతో ప్రత్యర్థులపై చాలా ప్రభావం చూపింది.
ఆ తరవాత మస్టర్డ్ గ్యాస్‌ను సృష్టించారు. దీని ప్రభావానికి లోనైన చర్మంపై పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడతాయి. యుద్ధంలో ప్రాణనష్టం కలిగించడానికే దీన్ని తయారు చేశారు. దీని సాయంతో సైనికుల దృష్టి మరల్చడానికి ప్రయత్నించేవారు.
ఆ తరవాత చాలా కాలానికి నాజీలు నెర్వ్ ఏజెంట్లను అభివృద్ధి చేశారు. నరాల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే రసాయనాలే నెర్వ్ ఏజెంట్స్.
నాజీలు అభివృద్ధి చేసిన టబున్, సొమన్ లాంటి నెర్వ్ ఏజెంట్లు మనుషులను సులువుగా చంపగలవని మొదట వాళ్లూ ఊహించలేదు.
1984-1988 మధ్య జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో నెర్వ్ ఏజెంట్లు కీలకపాత్ర పోషించాయి. 1988 మార్చి 16న హలాబ్జాలో జరిగిన నెర్వ్ ఏజెంట్ల దాడిని ఎవరూ సులువుగా మరచిపోలేరు. ఆ ఒక్కరోజే 5వేల మందిదాకా చనిపోయారు.
అప్పట్నుంచీ కేవలం సిరియాలోనే కొన్ని వేలసార్లు రసాయన ఆయుధాలను ఉపయోగించారు. ప్రస్తుతం రసాయన ఆయుధాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా బాగా విస్తరించింది. ఆ ఆయుధాలు ప్రాణ నష్టంతో పాటు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలనూ సృష్టిస్తున్నాయి.
సిరియాకు సంబంధించిన ఇతర కథనాలు చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)