You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహిళా రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దుపెట్టిన ఆటగాడు.. మహిళా రిపోర్టర్ల ఆగ్రహం
అప్పట్లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఓ మహిళా రిపోర్టర్‌పై లైవ్‌లో అభ్యంతరకర కామెంట్ చేయడం ఆ తరవాత క్షమాపణ చెప్పడం గుర్తుందా? బ్రెజిల్‌లో అలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువయ్యాయి.
అక్కడ మైదానంలో రిపోర్టింగ్ చేసే మహిళా రిపోర్టర్లకు ఆటగాళ్లు, కోచ్‌లు, ప్రేక్షకులు.. ఇలా రకరకాల వ్యక్తుల నుంచి లైవ్‌లోనే భిన్నమైన వేధింపులు ఎదురవుతున్నాయి.
లైవ్‌లో రిపోర్టింగ్ చేసేప్పుడు వెనక నుంచి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడం, అసభ్యంగా మాట్లాడటం.. ఇలా మహిళా రిపోర్టర్లు రకరకాల అవాంఛనీయ పరిస్థితులును ఎదుర్కొంటున్నారు.
అలా బ్రెజిల్‌లో వేధింపులకు గురైన మహిళా స్పోర్ట్స్ రిపోర్టర్లంతా ఇప్పుడు ఒక్కటయ్యారు.
తమకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ అంతా కలిసి ఓ వీడియోను రూపొందించారు. అందరిలానే తమకు స్వేచ్ఛగా పనిచేసే హక్కు ఉందని, తమ పనిని ఆటంకం లేకుండా చేసుకోనివ్వాలని, మైదానంలో, ఆఫీసులో, వీధుల్లో తమతో గౌరవంగా ప్రవర్తించాలని కోరారు.
ఇది #MeToo క్యాంపైన్ తరహా ఉద్యమమని కొందరు రిపోర్టర్లు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)