You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జోల పాటలు, లాలి పాటలతో పిల్లలకే కాదు.. తల్లికి కూడా లాభమేనంట!
ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఒకరకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు.
అయితే... పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.
అందులోనూ ఒంటరిగా కాకుండా.. గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపే మహిళలల్లో మరీ తొందరగా మార్పు వస్తుందని పరిశోధకులు గుర్తించారు.
ప్రతి ఎనిమిది మంది బాలింతల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.
గతంలో వయసు పైబడిన వారు పాటలు పాడుతూ డెమెన్షియా వంటి మానసిక రుగ్మతుల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించాయి.
బాలింతలకూ పాటలు మందుగా పనిచేస్తాయని చెప్పిన తొలి అధ్యయనం ఇదే.
ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతున్న 134 మంది మహిళలపై అధ్యయనం చేశారు.
వారిని మూడు గ్రూపులుగా విభజించారు.
- ఒక బృందం వారితో గుంపుగా కలిసి పాటలు పాడించారు.
- రెండో గ్రూపులోని వారితో ఆటలు ఆడించారు.
- మూడో బృందం సభ్యులు సాధారణంగా కుటుంబ సభ్యుల సాయం తీసుకుంటూ.. మందులు వాడారు.
మూడు బృందాల్లోని మహిళలు కోలుకునేందుకు 10 వారాలు పట్టింది.
వారిలో మొదటి గ్రూపులోని మహిళల్లో ఇతరుల కంటే చాలా తొందరగా కుంగుబాటు లక్షణాలు దూరమయ్యాయి.
బృందంలో కాకున్నా.. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు.
ఇతర కథనాలు:
- రక్తదానం, అవయవదానాలు సరే.. అండదానం తెలుసా!
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషి ఛిల్లర్
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- పొడవుంటే కేన్సర్ రిస్క్ ఎక్కువా?
- #BBCSpecial ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- హెచ్-1బీ: 'గ్రీన్ కార్డు రావాలంటే మరో 108 ఏళ్లు ఆగాలి'
- ఉత్తర కొరియా అధ్యక్షుడి భార్య ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)