You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన రోగాలు రావంట. ఒంటరిగా ఉంటున్న వాళ్లతో పోల్చితే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని.. ఆరోగ్యకరంగా జీవించేందుకు పెళ్లి ఓ చక్కని మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయంపై బ్రిటన్‌లో 10 లక్షల మందిపై అధ్యయనం జరిగింది. వారంతా అధిక రక్తపోటు.. డయాబెటిస్ వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారే.
వీళ్లలో ఒంటరిగా ఉంటున్న వారికంటే పెళ్లైన వారు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనూ.. వివాహితులు తొందరగా కోలుకుంటున్నారని తేలింది.
ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
50 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిని పరిశీలిస్తే.. అవివాహితుల కంటే వివాహితులు 16శాతం ఎక్కువ కాలం బతుకుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
వివాహంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అయితే.. పెళ్లై విడిపోయిన, భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న వారి విషయంలో మాత్రం పరిశోధకులు ఓ స్పష్టతకు రాలేదు.
గుండె జబ్బులకు కారణాలు
- ధూమపానం, అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు, మధుమేహం, అధిక బరువు, శారీకర శ్రమ లేకపోవటం, గుండె జబ్బుల వారసత్వం, పెరుగుతున్న వయస్సు.
మా ఇతర కథనాలు:
- 'లవ్ జిహాద్'.. ప్రేమ - 'ప్రత్యేక వివాహం'
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- అనుష్క, విరాట్ల పెళ్లి జరిగింది ఇటలీలోని ఈ గ్రామంలోనే!
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- 'పురోహితులకు ప్రభుత్వం కట్నమిస్తోందా!'
- ఆ ప్రశ్నలు అమ్మాయిలకే ఎందుకు?
- పెళ్లి గురించి రాహుల్ ఏమన్నారు?
- .. అందుకే పెళ్లి చేసుకోమనేది!
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- ఇక్కడ హెచ్ఐవీ బాధితులకు పెళ్లి సంబంధాలు చూడబడును
- జీఈఎస్ సదస్సు: ‘పెట్టుబడి పెట్టమంటే.. పెళ్లెప్పుడు చేసుకుంటావు? అని అడిగారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)