అంతరిక్షంలో ఏడాది గడిపితే మనిషి శరీరానికి ఏమవుతుంది?

వీడియో క్యాప్షన్, అంతరిక్షంలో ఏడాది గడిపితే మనిషి శరీరానికి ఏమవుతుంది?

అసలు ఏమాత్రం గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో, ఓ వ్యోమనౌకలో ఏడాది పాటు జీవించారు స్కాట్ కెల్లీ. అంతరిక్ష వాతావరణ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న పరిశోధనలో భాగంగా ఆయన ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు.

340 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2016లో ఆయన తిరిగి భూమ్మీదకు వచ్చారు. అక్కడి వాతావరణం తన చర్మంపై ప్రతికూల ప్రభావం చూపిందనీ, చర్మం బాగా సున్నితంగా తయారైందనీ అంటున్నారు.

ఇన్నాళ్లపాటు సాగిన పరిశోధనల ఫలితాలు, ఏదో ఒక రోజు మనుషులు అంగారకుడిపై జీవించగలరన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయని స్కాట్ చెబుతున్నారు.

ఇవి కూడా చూడండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)