బీబీసీ బ్లూ ప్లానెట్: ఈ సరస్సులు సముద్ర గర్భ స్మశానాలు
సముద్రం ఓ ప్రపంచం. లక్షలాది జీవరాశులకు కన్న తల్లి. ఈ తల్లి గర్భంలోనే ఓ విష ప్రపంచం కూడా ఉంది. అదే ‘లవణ సరస్సు’.
సముద్ర గర్భంలో మీథేన్ వాయువులు ఉత్పన్నమవడంతో ఈ సరస్సులు ఏర్పడతాయి. ఈ సరస్సుల్లోని నీటిలో లవణ శాతం తీవ్రంగా ఉంటుంది. సాధారణ సముద్రపు నీటి కంటే ఇక్కడి నీరు 5 రెట్లు ఎక్కువ ఉప్పగా ఉంటుంది.
ఈ సరస్సుల్లోకి జీవరాశులు వేటకు వెళ్తాయి. అలా వెళ్లడం నిజంగా ఓ సాహసమే.. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ జీవరాశులేవీ బతకలేవు. అలాంటి ఈ సరస్సులోకి ఓ ఈల్ చేప వెళ్లింది. చివరకు దాని పరిస్థితి ఏమిటి? ఆ చేప బతికిందా? లేదా?
ఈ సముద్ర గర్భం మనల్ని కూడా ఆహ్వానిస్తోంది.. రండి లోపలికి వెళ్దాం రండి!!
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
