అలలు సృష్టించిన అద్భుతం
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ అలలను చూడండి. రెండు కాదు.. మూడు కాదు.. 10 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. చైనాలోని క్వైన్‌టాంగ్ నది, సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ వింతను చూసేందుకు పర్యాటకులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలో వచ్చినప్పుడు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)