శిధిలాల్లో నుంచి పుట్టిన సిరియా చిన్నారి అయా గురించి వైద్యులేమంటున్నారు

వీడియో క్యాప్షన్, శిధిలాల్లో నుంచి పుట్టిన సిరియా చిన్నారి అయా గురించి వైద్యులేమంటున్నారు

వాయువ్య సిరియా ప్రాంతాన్ని ఘోరంగా కుదిపేసింది భూకంపం. వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటకొస్తున్న వాళ్లూ ఉన్నారు. అలా బయటపడిన వారిలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉంది.

ఆ పాప కుటుంబం నివాసముండే ఇల్లు నేలకూలింది. తల్లిదండ్రులు చనిపోయారు.

శిథిలాల్లోనే పుట్టిన పాపను బొడ్డు తాడు కోసి చనిపోయిన తల్లి నుంచి వేరు చేసి బయటకు తీశారు.

ఈ సంఘటన ప్రపంచాన్ని కదిలించింది. ఆ పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయా అని పేరు పెట్టారు. అయా అంటే అద్భుతం అని అర్ధం.

ఆమెను దత్తత తీసుకుంటామని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ముందుకు వస్తున్నారు. మరి వైద్యులేమంటున్నారు?

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)