జనరిక్ మందులు: 50-90 శాతం తక్కువకు లభిస్తున్నా ఎందుకు తక్కువగా కొంటున్నారు?

వీడియో క్యాప్షన్, జనరిక్ మందులు: 50-90 శాతం తక్కువకు లభిస్తున్నా ఎందుకు తక్కువగా కొంటున్నారు?

జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లటానికి ముందు సాధారణంగా ఒకటి రెండు రోజుల పాటు మందుల షాపుకు వెళ్లి జ్వరం బిళ్లలు తెచ్చుకుని వాడటం పరిపాటి. మెడికల్ షాపుకు వెళ్లినపుడు జ్వరం బిళ్లలు అనగానే 'డోలో 650', 'క్రోసిన్ 650' వంటి బ్రాండెడ్ మందులు ఇస్తారు.

డోలో 650 ట్యాబ్లెట్లు 15 బిళ్లల షీట్ ధర 29 రూపాయలు. ఇందులో ఉండే ఔషధం పారాసెటమాల్, మోతాదు 650 మిల్లీ గ్రాములు. ఇదే ఔషధాన్ని మరో కంపెనీ 'పారాసిప్ 650' పేరుతో అమ్ముతుంది. ఇది 10 ట్యాబ్లెట్ల షీట్ ధర 18 రూపాయలు.

అయితే.. ఇదే ఔషధం 'పారాసెటమాల్ 650' పేరుతో 'జనరిక్ మందు'గా కూడా దొరకుతుంది. ఇది 10 ట్యాబ్లెట్ల షీట్ 4.50 రూపాయలకే లభిస్తుంది.

కానీ జనం ఎక్కువగా వాడేది డోలో 650 లేదా క్రోసిన్ 650 లేదా పారాసిప్ 650 వంటి ఖరీదైన బ్రాండెడ్ మందే. పారాసెటమాల్ 650 అనే అతి చౌకైన జనరిక్ మందు వాడటం చాలా చాలా చాలా అరుదు.

ఇలాగే.. ముందులున్న అన్ని జబ్బులకూ ఖరీదైన బ్రాండెడ్ మందులతో పాటు చౌకైన జనరిక్ మందులు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ప్రభుత్వం సైతం జనరిక్ మందుల షాపులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది.

కానీ జనం ఎక్కువగా తాహతుకు మించి ఖర్చయినా బ్రాండెడ్ మందులే వాడుతున్నారు. అత్యంత చౌకగా దొరికే జనరిక్ మందుల వైపు చూసే వారు అతి తక్కువ. ఎందుకిలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)