స్పాన్సర్లు లేకపోయినా, తక్కువ జీతం ఉన్నా వీసాలు ఇస్తారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించిన కొత్త వీసా నిబంధనలు ఈ నెల మూడో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
కొత్త వీసా నిబంధనల్లో భాగంగా, పర్యటకులకు దీర్ఘకాల వీసాలు, వృత్తి నిపుణులకు దీర్ఘకాల సదుపాయాలు కల్పిస్తామని యూఏఈ తెలిపింది.
పారిశ్రామికవేత్తలు, మదుపరులు, ప్రొఫెషనల్స్ కోసం కొత్త పదేళ్ల గోల్డెన్ వీసా పథకాన్ని తీసుకొచ్చారు.
యూఏఈ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు భారత్‌కు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అక్కడ పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో తెలుగు ప్రజలు కూడా పెద్దయెత్తున ఉంటారు.
మొత్తంగా యూఏఈలో 34 లక్షల మందికిపైగా భారతీయులు ఉన్నారు. వీరిలో కేరళ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల కోసం అక్కడకు ఎక్కువగా వెళ్తుంటారు. కొత్త గ్రీన్ వీసా విధానంతో వీరికి మేలు జరిగే అవకాశముంటుంది.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)