కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి ఈ యువ దంపతులు పాదయాత్ర చేస్తున్నారు, ఎందుకు?
చదువులు పూర్తయ్యి మంచి కార్పొరేట్ ఉద్యోగాలుంటే మీరేం చేస్తారు? హమ్మయ్య లైఫ్ సెట్టయ్యిందిలే అనుకుని రిలాక్స్ అయిపోతారు చాలా మంది.
కానీ నిఖిల్, పరిధి అనే ఇద్దరు యువ దంపతులు కొంచెం కొత్తగా ఆలోచించారు.
ఉద్యోగాలకు బైబై చెప్పి ఏడాది కాలంగా కాలినడకన లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు.
ఇంతకీ ఈ జంట ఇలా ఎందుకు పర్యటిస్తున్నారు?
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి పరాగ్ పాఠక్, నీలేష్ భోస్లే అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
నిఖిల్, పరిధి ఇద్దరూ కార్పొరేట్ ఉద్యోగస్తులు. రొటీన్‌కి భిన్నంగా ఏదైనా చేయాలనుకున్న ఈ జంట కాలినడకన లద్దాఖ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది కాలంగా లద్దాఖ్‌లో కాలినడకన పర్యటిస్తూ రకరకాల ప్రదేశాలను సందర్శించారు. ప్రపంచ పర్యటక దినమైన 2022 సెప్టెంబర్ 27 నాటికి 3వేల 2వందల కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేశామని చెప్పారు.
‘‘మేం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఆ ఉద్యోగాల్ని వదిలేసి, మనాలి నుంచి మొదలు పెట్టి లద్దాఖ్ ప్రాంతమంతా నడిచి వచ్చాం. ఇప్పుడు శ్రీనగర్‌లో ఉన్నాం’’ అని నిఖిల్ సావ్లాపుర్కర్ చెప్పారు.
లద్దాఖ్‌లోని విపరీత వాతావరణాన్ని తట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి తమను తాము కాపాడుకున్నారు. గతంలో వాళ్ళు తమ 11 అంతస్తుల భవనంలో రోజూ 5కిలోల బ్యాగ్‌తో మెట్లపైకి ఎక్కేవారు. ఇప్పుడు గత ఏడాది కాలంగా లద్దాఖ్ నాగరికతను, ప్రజల సంస్కృతీ సంప్రదాయల గురించి తెలుసుకుంటున్నారు. పర్యటకులు పర్యావరణం విషయంలో బాధ్యతగా వ్యవహరించాలంటారు ఈ దంపతులు.
‘‘మా చిన్న ప్రయత్నమేంటంటే పర్యటకులు కూడా పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించారు.
అందులో భాగంగానే మేం ఇలా కాలినడకన పర్యటిస్తున్నాం. మనలో ప్రతీ ఒక్కరం బాధ్యతాయుతంగా ఉంటే పర్యటక రంగం కూడా పుంజుకుంటుంది, ప్రకృతిని కూడా కాపాడిన వారిమవుతాం అని భావిస్తున్నాను’’ అని పరీ సావ్లాపుర్కర్ అన్నారు.
గతంలో తమకు ఏ మాత్రం తెలీని చాలా గ్రామాల ప్రజలు ఇప్పుడు వారి సొంత కుటుంబీకులుగా మారిపోయారు. లద్దాఖ్ రుచులంటే వారికిప్పుడు ఎంతో ఇష్టం. ఈ పర్యటన పూర్తయ్యాక యాత్రా విశేషాలతో వీరిద్దరూ కలిసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)