ఫొటోగ్రఫీతో 57 ఏళ్ల సత్యభామ ప్రత్యేక గుర్తింపు.. ఫొటోల కోసం పోలీసులూ ఆమెను పిలుస్తారు

వీడియో క్యాప్షన్, ఫొటోగ్రఫీతో 57 ఏళ్ల సత్యభామ ప్రత్యేక గుర్తింపు.. ఫొటోల కోసం పోలీసులూ ఆమెను పిలుస్తారు

ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో నానాటికీ పెరుగుతున్న పోటీ నడుమ 57 ఏళ్ల సత్యభామ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

తమిళనాడులోని సాలెం జిల్లా నాచనంబెట్టి గ్రామంలో 57 ఏళ్ల వయసులోనూ ఆమె ఉత్సాహంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. భర్త చనిపోయిన తర్వాత, ఆయన వృత్తి అయిన ఫోటోగ్రఫీనే జీవనోపాధిగా ఆమె ఎంచుకున్నారు.

జీవనోపాధి కోసం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆమెకు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతోంది.

నాచనంబెట్టి గ్రామానికి పొరుగున ఉండే థీవట్టిపట్టి గ్రామంలో ఆమె భర్తకు ఒక ఫోటో స్టూడియో ఉండేది. అయితే, అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో కుటుంబాన్ని నడిపేందుకు సత్యభామ ఫోటోగ్రాఫర్‌గా మారారు.

మొదట్లో ఇంటికి మాత్రమే పరిమితమైన ఆమె ఇప్పుడు ఫోటో స్టూడియో నడిపిస్తున్నారు. స్టూడియో సాయంతోనే తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగానని ఆమె చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)