కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

వీడియో క్యాప్షన్, కన్నతల్లికి మళ్లీ పెళ్లి చేసిన కూతురు

ఇది అస్సాంలో ఉంటున్న నిర్మలీ కథ. ఆమె కూతురే ఆమెకు పెళ్లి చేశారు.

నిర్మలీ మొదటి పెళ్లి విఫలమైంది. ఆమె 20 ఏళ్ల వయసులో తన కూతురితోపాటూ అత్తింటి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదువు కొనసాగించారు.

‘ఆ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడంతో ఇల్లు వదలాల్సి వచ్చింది. చదువుకోవడానికి హాస్టల్లో ఉండాలి. నాతోపాటూ నా కూతుర్ని ఉంచుకోలేను. అందుకే పాపను మా అమ్మనాన్న దగ్గర వదిలి

చదువు పూర్తి చేయడానికి వెళ్లాను. నా కాళ్లపై నేను నిలబడిన తర్వాత నా కూతురి దగ్గరకు తిరిగొచ్చాను’ అని నిర్మలీ చెప్పారు.

నిర్మలీకి బైక్ నడపడమంటే చాలా ఇష్టం. అలాంటి ఒక ప్రయాణంలోనే ఆమె తనకు కాబోయే జీవిత భాగస్వామిని కలిశారు. చివరికి వారి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది.

‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా కష్టమైంది. దానికి నా గత అనుభవాలు కారణం. నేను ఎక్కువగా ఇండిపెండెంట్‌గా ఉండేదాన్ని. నాకు నచ్చినట్లు

జీవించాలనుకునేదాన్ని. మొదట్లో అయితే వద్దని చెప్పేద్దామనుకున్నా. వేరే రాష్ట్రం వాళ్లుకదా ఎలా ఉంటారో అనుకున్నా. అంటే అస్సాం వాళ్లు ఉత్తరాది వాళ్లతో పెద్దగా కలవలేరు. కానీ, వాళ్ల ఇంట్లోవాళ్లతో మాట్లాడించాక.. వీళ్లు మంచివాళ్లు అనిపించింది’

‘నా కూతురు నా పెళ్లికి ఒప్పుకోవడం చాలా ముఖ్యం. తను అమెరికాలో స్థిరపడింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తనకు చెప్పాలనుకున్నా. ఆ విషయం మాట్లాడినపుడు తను చాలా సంతోషించింది’ అని చెప్పారు నిర్మలీ.

అనంతరం నిర్మలీ కూతురు ప్రియాంక అమెరికా నుంచి భారత్ వచ్చారు. తల్లికి దగ్గరుండి పెళ్లి చేశారు.ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)