గుజరాత్: ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

వీడియో క్యాప్షన్, ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది నేరస్థులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఆగస్టు 15న వీరిని విడుదల చేశాక దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసుల్లో సాక్ష్యమిచ్చిన కొందరిని బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛారా కలిశారు.

న్యాయం కోసం తాము చేసిన పోరాటాన్ని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను వారు ఆయనతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)