రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్‌పై పట్టు ఎలా సాధించారు

వీడియో క్యాప్షన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్‌పై పట్టు ఎలా సాధించారు

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం రూ.5 వేలతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు చెబుతారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఈ ఏడాది ఆయన మొత్తం సంపద విలువ 600 కోట్ల డాలర్లు(సుమారు రూ.45,328 కోట్లు).

ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఆయన అత్యంత విలువైన లిస్టెడ్ హోల్డింగ్స్‌లో గడియారాలు, ఆభరణాలు తయారు చేసే టైటన్ ఉంది.

ఇది టాటా గ్రూప్‌లో భాగం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్‌కార్డ్ బయోటెక్ లాంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా ఝున్‌ఝున్‌వాలాకు భారీగా వాటాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)