బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది?

వీడియో క్యాప్షన్, బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఓ మూలన విసిరేసినట్టుగా ఉండే బాసర ఇటీవల వరుస విద్యార్థి నిరసన కార్యక్రమాలతో వార్తల్లో నిలిచింది.

శాంతియుతంగా గాంధేయ పద్దతిలో ఎండా, వాన, రాత్రి, పగలు సాగించిన విద్యార్థుల ఆందోళన అన్ని పక్షాల మద్దతు, సంఘీభావం పొందింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏకతాటి పై సాగిన విద్యార్థి పోరాటాన్ని ఇది గుర్తుచేసిందన్న అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి.

'ట్రిపుల్ ఐటీ' బాసర క్యాంపస్ లో ఈ మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితులు ఇవి.

బాసర ట్రిపుల్ ఐటీ 8 వేల పైచిలుకు విద్యార్థులతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విద్యార్థి క్యాంపస్ లలో ఒకటిగా ఉంది.

సుమారు 270 ఎకరాల్లో విస్తరించిన బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను 6 వేల మంది విద్యార్థుల విద్యా, ఆవాసం, క్రీడలు ఇతరత్రా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. పూర్తిగా ప్రభుత్వ గ్రాంట్ ల పై నడిచే విద్యా సంస్థ కావడంతో ఆర్థిక స్వయం సమృద్ది కోసం ఈమధ్య కాలంలో 'గ్లోబల్ కోటా' కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను అందుబాటులో తెచ్చి అడ్మిషన్ల సంఖ్య పెంచారు.

అయితే, అదే స్థాయిలో సౌకర్యాలు పెరగక పోవడం, నిర్ణయాలు తీసుకునే కీలక స్థానాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో విద్య, భోజన, ఇతర వసతుల్లో నాణ్యత పడిపోయిందని, దేశంలో ఉన్నత విద్యా సంస్థల పనితీరు సూచించే 'నాక్' (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రేటింగ్స్ లో 'సి' గ్రేడ్ కు బాసర ట్రిపుల్ ఐటీ పరిమితం కావడం దీనికి ఉదాహరణ అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)