గుజరాత్: ‘కులం పేరుతో బడిలో పిల్లలను వేర్వేరుగా కూర్చోబెట్టిన టీచర్లు...’

వీడియో క్యాప్షన్, కులం పేరుతో బడుల్లో పిల్లలను వేర్వేరుగా కూర్చోబెడుతున్న టీచర్లు..

లీలా బేన్.. గుజరాత్ లోని బనాస్కాంఠా జిల్లాలోని అంగన్వాడా గ్రామంలో ఉంటారు. ఆమెది వాల్మీకి కులం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలపై వివక్ష చూపుతున్నారని ఆమె అంటున్నారు.

స్కూలు తరగతులు ప్రారంభమయ్యాక ఒక రోజు మధ్యాహ్న భోజన సమయంలో లీలా కుటుంబ సభ్యులు కొన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోల్లో మిగతా పిల్లలంతా ఒక వైపు ఉంటే, వాల్మీకి కులానికి చెందిన ముగ్గురు పిల్లలు మాత్రం ఒక మూలన కూర్చొని ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది.

‘‘మేం జంతువులం కాదు, మనుషులం. మీ లాగా మేము కూడా మనుషులుగానే పుట్టాం. మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు. మరి మా పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనకబాటుతనంలో మగ్గాలి? 10-15 రోజులుగా మా పిల్లలు బడికి వెళ్ళడంలేదు. ఇంట్లోనే ఉంటున్నారు’’ అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)