నాలుగేళ్ల పాటు సైన్యంలో ఉద్యోగం, వేలలో జీతం, సర్వీస్ పూర్తయ్యాక సమగ్ర ఆర్థిక ప్యాకేజ్
యువతకు దేశ సేవ చేసే అవకాశం కల్పించేందుకు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం దేశ యువతను వినియోగించుకోవాలి భావిస్తున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.
అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పని చేయొచ్చు.
ప్రస్తుతం అబ్బాయిలకే మాత్రమే అవకాశం. అమ్మాయిలకు తరువాత అవకాశం కల్పిస్తారు.
వయసు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
తొలి ఏడాది రూ.4.76 లక్షల ప్యాకేజీ చెల్లిస్తారు. నాలుగో ఏడాదిలో రూ.6.92 లక్షలు లభిస్తాయి.
అగ్నివీరులు భవిష్యత్తు సైనికులు అవుతారని, చాలా కఠినమైన పద్ధతిలో వారి నియామకాలు చేపడతామని సైన్యం తెలిపింది.
ఈ పథకం ద్వారా సైన్యంలో చేరే 25 శాతం మంది యువతను తర్వాత రీటెయిన్ చేస్తారు. అంటే 100లో 25 మందికి శాశ్వత సేవలు అందించే అవకాశం లభిస్తుంది.
ఈ పథకం కింద నాలుగేళ్లకు దాదాపు 45 వేల మంది యువతీయువకులను భర్తీ చేస్తామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రయాగ్‌రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
- పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)