స్టాట్యూ ఆఫ్ యూనిటీ: 150 మంది మహిళలను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు?

వీడియో క్యాప్షన్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ: 150 మంది మహిళలను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు?

స్టాట్యూ ఆఫ్ యూనిటీలో హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న స్థానిక గిరిజన సంఘానికి చెందిన 150 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించారు.

తమ ఉద్యోగాలను తిరిగి ఇవ్వాలని వీళ్లిప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

ఓ ఏజెన్సీ ద్వారా ఈ గిరిజన మహిళలు ఉద్యోగంలో చేరారు. హౌస్ కీపింగ్ ఉద్యోగం కోసం వీళ్లు కాంట్రాక్ట్ పొందారు.

కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీని తొలగించి, వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌కు పనులు అప్పగించగా ఈ పని కోసం యంత్రాలను ఉపయోగిస్తోంది వీఎంసీ. అది స్థానిక గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)