హార్సిలీ హిల్స్: ఈ ఆంధ్రా ఊటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ గడిపితే టీబీ వ్యాధి నయమవుతుందా
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్ ఇవి. ఆంధ్రా ఊటీగా చెప్పుకునే ఈ ప్రాంతం వేసవిలో ప్రజలకు ఉల్లాసాన్ని పంచుతోంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పర్యటకులకు చల్లటి విడిదినిస్తోంది.
ఏనుగు మల్లమ్మ కొండ సముద్ర మట్టానికి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండపై ఉండే చల్లదనాన్ని, ఈ ప్రాంతం ప్రత్యేకతను బ్రిటిష్ ప్రభుత్వంలో కలెక్టర్‌గా పని చేసిన హార్సిలీ గుర్తించారు. దాంతో ఆయన పేరు మీదుగా దీన్ని హార్సిలీ హిల్స్ అని పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.
ఈ కొండపై వాతావరణం చల్లగా ఉండడంతో హార్సీలీ ఇక్కడే ఎక్కువగా గడిపారని ఉమ్మడి చిత్తూరు జిల్లా టూరిజం శాఖ ఎండీ గిరిధర్ రెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- వాతావరణ లక్ష్యాలు: చేసిన హామీలకు దేశాలు కట్టుబడుతున్నాయా? ఎంతవరకు నెరవేర్చుతున్నాయి?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- పుతిన్ కాల్పుల విరమణ ప్రకటిస్తారా? యుక్రెయిన్ గెలుస్తుందా
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)