చూపులేని ఈ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు ఎలా రాశారంటే..

వీడియో క్యాప్షన్, చూపులేని ఈ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు ఎలా రాశారంటే..

విద్యార్థులందరిలాగే వీరికి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా ముఖ్యం. చూపు లేని ఈ విద్యార్థులు ఇటీవలే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.

చిన్నప్పటి నుంచి వీళ్లంతా బ్రెయిలీ లిపిలోనే చదువుతూ, రాస్తూ వచ్చినా, బోర్డు పరీక్షలను వీళ్లే స్వయంగా రాసుకోవడం కుదరదు.

ఎందుకంటే వీళ్లు బ్రెయిలీలో రాసే సమాధానాలను దిద్దే వారే లేరు. దాంతో ఈ విద్యార్థులందరూ స్క్రైబర్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.

అయితే తాము చెప్పిన సమాధానాలను వాళ్లు ఎలా రాశారో అనే టెన్షన్ విద్యార్థులందరిలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)