నిజామాబాద్: బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఇంత వివాదం ఎందుకు?

వీడియో క్యాప్షన్, బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటులో వివాదం ఎందుకు?

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని అంబేద్కర్ సర్కిల్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్బంగా పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, బీజేపీ, శివసేన వర్గం, ఎంఐఎం వర్గం ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగాయి.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

అనంతరం బోధన్‌లో 144 సెక్షన్ విధించి, ప్రధాన కూడళ్ల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిర్మల్, కామారెడ్డి జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు.

అసలు ఈ విగ్రహ ఏర్పాటుపై ఇంత వివాదం ఎందుకు జరిగింది. ఎవరు ఏం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)