మ్యూచువల్ ఫండ్స్‌: నెలకు రూ.5 వేల పెట్టుబడితో పదేళ్లకు 12 లక్షలు సంపాదించొచ్చా?

వీడియో క్యాప్షన్, నెలకు 5000తో 12 లక్షలు సంపాదించొచ్చా

మదుపు మార్గం ఏదైనా మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా మన ప్రణాళిక ఉండాలి.

కానీ రిస్క్ లేని మదుపు మార్గాలు లేవు. మదుపులో సహజంగా ఉండే రిస్క్ కాక మరెన్నో కారణాలు మదుపు మీద వచ్చే రాబడిని ప్రభావితం చేస్తాయి.

విపత్కర పరిస్థితులు, సంక్షోభాలు జరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా దెబ్బతింటాయి.

అలా ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ మౌలిక సూత్రాలను మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఎలా అన్వయించుకోవాలి.

వివిధ కంపెనీల పనితీరుని విశ్లేషించే సమయం లేని వాళ్లకు ఇండెక్స్ ఫండ్ ఒక గొప్ప అవకాశం. గోల్డ్ ఫండ్స్ తప్ప మిగతా అన్ని ఇండెక్స్ ఫండ్స్ 12% కంటే ఎక్కువ రాబడిని గత పదేళ్ళుగా ఇస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)