హిజాబ్ వివాదం: జై శ్రీరామ్ నినాదాల హోరులో అల్లా హు అక్బర్ అని గొంతెత్తిన ఈ యువతి ఎవరు

వీడియో క్యాప్షన్, కర్నాటక: జై శ్రీరామ్ vs అల్లా హో అక్బర్

ఈ ఘటన కర్నాటకలోని మాండ్యాలో ఓ ప్రైవేటు కాలేజీలో జరిగింది.

అక్కడ ఒక అమ్మాయి హిజాబ్‌ ధరించి కాలేజీకి వచ్చారు.

అబ్బాయిలు ఆమె హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆ అమ్మాయి కూడా ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నినాదాలు చేశారు.

అబ్బాయిలకు, ఆ అమ్మాయికి మధ్య వాగ్వాదం పెద్దది కావడం మొదలైంది.

అప్పుడే అక్కడికి వచ్చిన ఓ లెక్చరర్ ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు.

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఎవరీ అమ్మాయి?

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక కథనం ప్రకారం.. ఈ యువతి పేరు ముస్కాన్. మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది.

"నా కాలేజీ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపాల్ నన్ను బురఖా ధరించకుండా ఎప్పుడూ ఆపలేదు. బయటి వ్యక్తులు వచ్చి మాపై ఒత్తిడి తెస్తున్నారు, ఇంతమంది మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? వారి మాట ఎందుకు వినాలి? నేను అసైన్‌మెంట్ సమర్పించడానికి కాలేజీలోకి వెళుతున్నా, అలా వెళుతున్నప్పుడే, కొంతమంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించినందుకు వేధింపులకు గురయ్యారు, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, నా కాలేజీ ఈ బట్టలు వేసుకోవడానికి నాకు అనుమతినిచ్చింది. గుంపులో కేవలం 10 శాతం మంది విద్యార్థులే మా కాలేజీ వాళ్లు. మిగతా వాళ్లంతా బయటివాళ్లే. వాళ్ల ప్రవర్తన నన్ను బాధపెట్టింది. అందుకే నేను సమాధానం చెప్పా."

తమ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు తనకు మద్దతు ఇచ్చారని ఆమె తెలిపారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)