BBC ISWOTY నామినీ పీవీ సింధు: రెండు ఒలింపిక్ పతకాలతో చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి

వీడియో క్యాప్షన్, BBC ISWOTY Nominee 5: PV Sindhu రెండు ఒలింపిక్ పతకాలతో చరిత్ర సృష్టించిన షట్లర్

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) అవార్డు నామినీల్లో ఒకరు పీవీ సింధు.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ.

2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజతం సాధించి 2021 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించారు సింధు.

2022 జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు.

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారామె.

సింధు 17 సంవత్సరాల వయస్సులోనే 2012 సెప్టెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి అడుగుపెట్టారు.

2019 సంవత్సరానికి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)