BBC ISWOTY నామినీ అవని లేఖర: భారత్‌కు పారాలింపిక్స్‌ తొలి స్వర్ణం అందించిన షూటర్

వీడియో క్యాప్షన్, BBC ISWOTY Nominee 2; Lovlina పారాలింపిక్స్‌ తొలి స్వర్ణం అందించిన షూటర్

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) అవార్డు నామినీల్లో ఒకరు అవని లేఖర.

పారాలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా 20 ఏళ్ల అవని లేఖర చరిత్ర సృష్టించారు.

టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు.

అదే ఒలింపిక్స్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ SH1లో కూడా అవని కాంస్యం గెలుచుకున్నారు.

చిన్నతనంలో జరిగిన ఒక పెద్ద కారు ప్రమాదంలో ఆమె నడుము నుంచి కింది భాగానికి పక్షవాతం వచ్చింది.

ఆ ప్రమాదం తరువాత, అవని తండ్రి ఆమెకు షూటింగ్ క్రీడను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.

క్రీడలపై ఉన్న మక్కువను కొనసాగిస్తూనే ఆమె లా చదువుతున్నారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)