BBC ISWOTY నామినీ అదితి అశోక్: భారత్‌లో గోల్ఫ్‌పై ఆసక్తిని రేకెత్తించిన క్రీడాకారిణి

వీడియో క్యాప్షన్, BBC ISWOTY Nominee 1 : Aditi Ashok భారత మహిళల సత్తా గోల్ఫ్ క్రీడాకారిణి

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) అవార్డు నామినీల్లో ఒకరు గోల్ఫర్ అదితి అశోక్.

ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి భారత మహిళల గోల్ఫ్ క్రీడకు మారుపేరుగా నిలిచారు అదితి అశోక్.

కేవలం 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఆ ఏడాది ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందంలో అతిపిన్న వయస్కురాలామె.

తరువాత, 2020 టోక్యో ఒలింపిక్స్‌ మహిళల గోల్ఫ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

గోల్ఫ్‌లో అదితి సాధించిన విజయం భారతదేశంలో మహిళల గోల్ఫ్‌పై ఆసక్తిని పెంచింది.

2016లో లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి ఆమె.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)