You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
WAN-IFRA సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్‌లో బీబీసీ ఒక వెండి పతకం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. బీబీసీ మరాఠీ అందించే డిజిటల్ బులెటిన్ ‘తీన్ గోష్టి’కి ‘బెస్ట్ ఇన్ ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్’ విభాగంలో వెండి పతకం లభించింది.
ఇక సింఘూ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో రూపొందించిన 'ఎ నైట్ ఎట్ ఇండియాస్ లార్జెస్ట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్' అనే డాక్యుమెంటరీ 'బెస్ట్ యూజ్ ఆఫ్ ఆన్‌లైన్ వీడియో' విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఈ డాక్యుమెంటరీని బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా రిపోర్ట్ చేయగా, నేహా శర్మ కెమెరా వర్క్ చేశారు.
బీబీసీ హిందీ నిర్వహించే పాడ్‌కాస్ట్ చర్చా కార్యక్రమం ‘వివేచనా’కు బెస్ట్ పాడ్‌కాస్ట్/డిజిటల్ ఆడియో ప్రాజెక్ట్ విభాగంలో కాంస్య పతకం లభించింది.
ఈ కార్యక్రమాన్ని బీబీసీ కరస్పాండెంట్ రేహన్ ఫజల్ సమర్పించారు. చరిత్ర అంశాలు, కీలక ఘట్టాలు, వ్యక్తిత్వం తదితర అంశాలపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టిసారిస్తుంది.
భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కవరేజ్‌కు అందించే ‘బెస్ట్ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ కోవిడ్-19’ విభాగంలో బీబీసీకి మరో కాంస్య పతకం లభించింది.
ఇవి కూడా చదవండి:
- Indian Sports Woman Of The Year అవార్డును ప్రారంభించిన బీబీసీ న్యూస్ ఇండియా
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)