You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వర్ణ దేవాలయంలో కలకలం - అపవిత్రం చేస్తున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు
సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ పోలీసులు తెలిపారు.
శనివారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది.
సిక్కుల మత గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్ ఉండే పవిత్రమైన ప్రాంతంలోకి ఆయన వెళ్లారన్నది ప్రధాన ఆరోపణ.
ఆపై అక్కడ గురు గ్రంథ్ సాహెబ్ పక్కనే ఉండే కత్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు, కానీ వెంటనే అక్కడున్న రక్షణ సిబ్బంది, భక్తులు ఆయన్ను బలవంతంగా వెనక్కు లాగేశారు.
ఈ ఘటన శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల ప్రాతంలో జరిగింది. సాయంకాల ప్రార్థనలు టీవీల్లో ప్రసారం చేస్తుండటంతో ఈ ఘటన కెమెరాల్లో రికార్డయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. అధికారులు అక్కడకు చేరుకునే సయమానికే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నారని, విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
ఈ చర్య వెనుక ఎవరున్నది పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసుల్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింఘ్ ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటన పంజాబ్‌లో రాజకీయంగానూ కలకలం సృష్టిస్తోంది. పవిత్ర స్థలాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికార పార్టీ విఫలమయ్యిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- ఆపరేషన్ సన్డౌన్: భింద్రన్వాలేను హెలికాప్టర్లతో కిడ్నాప్ చేయాలని ‘‘రా’’ ప్రణాళికలు వేసినప్పుడు ఏం జరిగింది?
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- అకాల్ తఖ్త్ నుంచి కాలు బయటపెట్టగానే భింద్రన్వాలే పైకి బుల్లెట్లు దూసుకొచ్చాయి
- తిరుమల డిక్లరేషన్ వివాదం: మక్కా మసీదు, వాటికన్ చర్చిలలోకి ఇతర మతస్తులు వెళ్లవచ్చా?
- ఈమె భారత్-పాక్ ప్రేమికుల్ని కలిపారు, అత్యాచార బాధితుల్ని స్వదేశాలకు చేర్చారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)