టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి... రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు

వీడియో క్యాప్షన్, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి... రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు

మంగళగిరి ఆత్మకూరులో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ మీద దాడి జరిగింది. గుంపుగా వచ్చిన వ్యక్తులు అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.

దాంతో, కార్యాలయంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు.

పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ ఆ దాడుల దృశ్యాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)