చంద్రబాబునాయుడు: 'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'

వీడియో క్యాప్షన్, చంద్రబాబునాయుడు: 'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని అన్నారు."ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎంపీటీసీ, జపీటీసీ ఎన్నికలను మా పార్టీ బహిష్కరిస్తోంది" అని ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారని, కానీ అలాంటి సంప్రదింపులు ఏమీ లేకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చంద్రబాబు అన్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా జరుగుతున్న ఈ ఎన్నికలలో తాము భాగస్వాములం కాలేమని, ఎస్ఈసీ తీరుకు నిరసనగా తమ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)