You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తం... పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవంనాడు మంగళవారం దేశ రాజధాని దిల్లీలో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారుతోంది.
దిల్లీ శివార్లలోని సింఘూ సరిహద్దుల్లో ప్రశాంతంగా ఈ ర్యాలీ మొదలైంది. పశ్చిమ దిల్లీలోని నాంగ్‌లోయికి వెళ్లేవరకు అంతా ప్రశాంతంగా సాగింది.
అయితే, దిల్లీ-నోయిడా, దిల్లీ-ఘాజియాబాద్ కూడలి వద్ద అక్షర్‌ధామ్ సమీపంలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఐవోటీ పరిసరాల్లో దిల్లీ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సును రైతులు ధ్వంసం చేశారు.
ఐవోటీ పరిసరాల్లోనే కొందరు పోలీసులపై నిరసనకారులు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు ఏఎన్‌ఐలో ప్రసారం అయ్యాయి. దీంతో మరోసారి నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో దిల్లీ మెట్రో గ్రీన్ లైన్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రకటించింది.
నాంగ్లోయిలో రైతులు ప్రదర్శనగా వస్తున్న మార్గంలో వారిని ముందుకు వెళ్లనివ్వకుండా దిల్లీ పోలీసులు రోడ్డుపై బైఠాయించారు.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ కొత్త రకాల మీద కూడా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సీన్...
- మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- స్పేస్ ఎక్స్ ప్రపంచ రికార్డ్: ఒకే రాకెట్లో అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాల ప్రయోగం
- భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు: రెండు వైపులా భద్రతా సిబ్బందికి గాయాలు
- అజింక్య రహానె: భారత్ క్రికెట్‌కు కెప్టెన్‌ను చేయాలంటూ డిమాండ్లు. కోహ్లీపై ఒత్తిడి పెరుగుతోందా ?
- ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలి: సుప్రీంకోర్టు
- ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- విశాఖపట్నం: ఈ అమ్మాయిలు బుల్లెట్ల మీద దూసుకెళ్తారు... కరాటే పాఠాలు కూడా నేర్పిస్తారు
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
- ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’ - అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ
- హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)