టపాకాయలు భారతదేశంలోకి ఎలా వచ్చాయి... వాటి చరిత్ర ఏంటి?

వీడియో క్యాప్షన్, టపాకాయలు భారతదేశంలోకి ఎలా వచ్చాయి... వాటి చరిత్ర ఏంటి?

పూర్వకాలంలో దీపావళిని దీపాలు వెలిగించి మాత్రమే జరుపుకునే వారు. ఏడెనిమిది శతాబ్దాల మధ్య కాలంలో చైనాలో టపాసుల తయారీ మొదలైంది. భారతదేశంలోకి అవి 14వ శతాబ్దంలో వర్తకుల ద్వారా వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ తరువాత మందుగుండు సామగ్రి టర్కీ చేరింది. అక్కడ వాటితో ఫిరంగులు తయారు చేయడం ప్రారంభించారు. బాబర్ తన ఆయుధ సంపత్తిలోకి ఫిరంగులను చేర్చడంతో శత్రువులు అతడి ముందు నిలువలేకపోయారు.

మొదట్లో టపాసుల ఖరీదు చాలా ఎక్కువ ఉండడంతో రాజ కుటుంబాల వారే వాటిని ఉపయోగించేవారు. కాలక్రమంలో అవి సామాన్యుడి సంబరాల్లో భాగమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)