ఎస్‌పీ బాలు పెళ్లి సింహాచలం గుడిలో ఎలా జరిగిందంటే...

వీడియో క్యాప్షన్, ఎస్‌పీ బాలు పెళ్లి సింహాచలం గుడిలో ఎలా జరిగిందంటే...

ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

బాలు, సావిత్రిల వివాహం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో 1969లో జరిగింది.

చెన్నై నుంచి వచ్చిన వారు ఈ ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారని వారికి రసీదు ఇచ్చిన పాసర్ల సూర్యనారాయణ చెప్పారు.

బాలు, సావిత్ర దంపతులకు ఓ కుమారుడు ఎస్‌పీబీ చ‌ర‌ణ్‌, కుమార్తె ప‌ల్ల‌వి ఉన్నారు. చ‌ర‌ణ్ కూడా గాయ‌కుడే. ఆయ‌న సినిమా నిర్మాత‌గానూ మారారు.

బాలు సోద‌రి ఎస్‌పీ శైల‌జ కూడా గాయ‌ని. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో న‌టించారు కూడా. న‌టుడు శుభ‌లేఖ సుధాక‌ర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)