You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
కోవిడ్-19కు టీకా తయారీలో నిమగ్నమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన టీకాతో రెండు, మూడు దశల హ్యూమన్ ట్రయల్స్‌కు భారత్ అనుమతినిచ్చింది.
ఈ ట్రయల్స్‌కు అంగీకారం తెలుపుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిర్ణయం తీసుకున్నట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఈ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సమగ్ర విశ్లేషణ తర్వాత, నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ ట్రయల్స్‌కు డీసీజీఐ అంగీకరించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన డేటాను పరిశీలించాక దీనికి అనుమతిస్తూ కమిటీ సిఫారసు చేసినట్లు డీసీజీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ అధ్యయనంలో ప్రతిరోగికి రెండు మోతాదుల చొప్పున (మొదటి రోజున ఒకటి, 29వ రోజున ఒకటి) టీకాను ఇస్తారు. తర్వాత 4 వారాలపాటు వారిలో రోగ నిరోధక శక్తిని అధ్యయనం చేస్తారు.
కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్‌ను ఆస్ట్రోజెనెకా అనే కంపెనీతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లో ఉత్పత్తి చేయబోతోంది.
భారతదేశంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది?
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 52,972 కేసులు నమోదయ్యాయని, కోవిడ్ -19 కారణంగా 771 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 4 రోజులుగా దేశంలో ప్రతిరోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
గత 15 రోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ రేటు ఎక్కువగా ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 11 లక్షలమందికి పైగా రోగులు కోలుకున్నారని, 5లక్షల యాక్టివ్ కేసులున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తర్వాత కేసుల సంఖ్యలో భారత్ మూడోస్థానంలో ఉంది.
దేశంలో కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు 38,135మంది చనిపోయారు. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్‌లకన్నా మరణాలలో వెనకబడిన భారత్... ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్‌లను దాటేసింది.
ఇప్పటి వరకు దేశంలో రెండు కోట్ల టెస్టులను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.
ఆగస్టు 2 నాటికి 2 కోట్ల 2వేల 858మందికి పరీక్షలు నిర్వహించగా, ఒక్క ఆగస్టు 2 నాడే 3 లక్షల 81వేల నమూనాలను సేకరించారు.
ఇవి కూడా చదవండి.
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- భూమికి తిరిగొచ్చిన నాసా - స్పేస్ ఎక్స్ వ్యోమగాములు
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మూడేళ్లుగా మూలనపడిన క్రేన్‌ను రిపేరు చేయాలనుకుంటే 11 మంది ప్రాణాలు పోయాయి
- భోపాల్ నవాబు పాకిస్తాన్ ప్రధాని పదవి చేపట్టబోయారా?
- సరిహద్దులో సేనల ఉపసంహరణపై భారత్, చైనా ల ప్రకటనల్లో ఎందుకింత తేడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)