You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసోం వరదలు: ‘ఇప్పటివరకూ 90కిపైగా మరణాలు, నీట మునిగిన 3,376 గ్రామాలు’
ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి.
ఇప్పటివరకూ ఈ వరదల్లో మరణించినవారి సంఖ్య 92కు చేరుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
వీరిలో 66 మంది నేరుగా వరదల వల్ల మరణించగా, 26 మంది కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో వరదల కారణంగా ఏడుగురు చనిపోయారు.
అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) ఈ వివరాలు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.
26 జిల్లాల వ్యాప్తంగా మొత్తం 36 లక్షల మంది ఈ వరదల వల్ల ప్రభావితమయ్యారు.
ధుబ్రి జిల్లాలో అత్యధికంగా 5.51 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని... బార్పేట, గోల్పారా జిల్లాల్లోనూ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఎస్‌డీఎంఏ తెలిపింది.
ఇప్పటివరకూ 3,376 గ్రామాలు నీట మునిగాయని, 1.27 లక్షల హెక్టార్ల మేర పంటలకు నష్టం జరిగినట్లు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 629 పునరావాస శిబిరాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని, 36 వేలకుపైగా మంది వాటిలో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది.
కజిరంగా నేషనల్ పార్క్‌లో 167, రాజీవ్ గాంధీ ఓరంగ్ నేషనల్ పార్క్‌లో 19, పోబితోరా వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో 24 క్యాంపుల్లోకి వరద చేరినట్లు పీటీఐ తెలిపింది.
66 జంతువులు చనిపోయాయని, కజిరంగా నేషనల్ పార్క్‌లోని 117 జంతువులను సిబ్బంది రక్షించారని పేర్కొంది.
కజిరంగాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గురువారం వెళ్లారు. అక్కడి సహాయ చర్యలను, ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
సమీపంలోని కొహోరా ప్రాంతంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి కూడా వెళ్లి, పరిస్థితులను సమీక్షించారు.
వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
ఏటా రుతుపవనాల సమయంలో అసోంలో భారీ వర్షాలు సాధారణమే అయినప్పటికీ, ఈసారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జనాల్లో మరింత ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారత్‌పై గూగుల్‌కు అంత ప్రేమ ఎందుకు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)