‘బాలకృష్ణ కోపంలో అలా అన్నారు కానీ..’ బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో నాగబాబు
బాలకృష్ణ ఆవేశంలో తమపై ఆరోపణలు చేసినట్లున్నారని.. ఆ తరువాత ఆయన కూడా దానిని పొడిగించలేదని నటుడు, జనసేన నాయకుడు నాగబాబు అన్నారు.
‘బీబీసీ తెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన అనేక అంశాలపై ముచ్చటిస్తూ ఇటీవల బాలకృష్ణకు, తనకు మధ్య జరిగిన మాటల యుద్ధంపైనా స్పందించారు.
బాలకృష్ణకు తనకు పరిచయం చాలా తక్కువని, తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు.
ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఏదో ఆవేశంలో అన్నవేనని, ఆయన ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని తాను భావించడం లేదని.. అలా మాట్టాడడం సరికాదంటూ తాను సమాధానమిచ్చాక ఆయన ఇక అంశాన్ని వదిలేశారని, పొడిగించలేదని, కాబట్టి తాను కూడా ఇక దానిపై మాట్లాడి వివాదాన్ని పెద్దది చేయబోనని అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో చిన్నచిన్న వివాదాలు ఏర్పడినా కూడా అవి టీ కప్పులో తుపానులా సద్దుమణిగిపోతాయని అన్నారు.
గాడ్సే దేశభక్తుడే
నాగబాబు ఇంతకుముందు గాడ్సే విషయంలో చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదమయ్యాయి. దానిపైనా ఆయన మాట్లాడుతూ తాను ఆ ట్వీట్ ఎందుకు చేశారో వివరించారు.
గాడ్సే మరణ వాంగ్మూలం తాను చదివానని.. అలాగే ఆయన గురించి గూగుల్‌లో అనేక అంశాలు చదివానని, కాకతాళీయంగా ఆయన జయంతి రోజునే తాను అది చదివానని.. సందర్భం వచ్చింది కాబట్టి ట్వీట్ చేశానని చెప్పారు.
గాంధీని హత్య చేయడం తప్పే అయినా గాడ్సే దేశభక్తుడనడంలో సందేహం లేదన్నారు.
ఇవి కూడా చదవండి
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా
- ఈ 5 ప్రాంతాల్లో జన్మిస్తే 100 ఏళ్లు బతికేసినట్లే
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)