రానా పెళ్లి కుదిరింది.. లాక్‌డౌన్ సమయంలో మా కుటుంబానికి శుభవార్త : ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో దగ్గుబాటి సురేశ్ బాబు

వీడియో క్యాప్షన్, దగ్గుబాటి రాణా: లాక్‌డౌన్ సమయంలో మా అబ్బాయికి పెళ్లి ముహూర్తం కుదిరింది

ఓటీటీలో సినిమాలు విడుదల చేయడమనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని.. ఇందులో రెండు కోణాలున్నాయని నిర్మాత సురేశ్ బాబు అన్నారు.

థియేటర్లకు కాకుండా పూర్తిగా ఓటీటీలోనే విడుదల చేస్తే మేం నష్టపోతామని థియేటర్ల యాజమాన్యాలు అంటున్నాయని.. అదేసమయంలో చిన్న నిర్మాతల అభిప్రాయం వేరేగా ఉందని అన్నారాయన.

ఇంతకాలం తమకు థియేటర్లు దొరకలేదని.. ఇప్పుడు తాము ఓటీటీలో విడుదల చేస్తామంటే అభ్యంతరాలెందుకన్న వాదన వారి నుంచి వినిపిస్తోందని చెప్పారు.

తన కుమారుడు, నటుడు రానాకు పెళ్లి కుదిరిందని.. త్వరలో తనకు కోడలు రానుందని.. కోవిడ్ సమయంలో తమ ఇంట్లో ఇది శుభవార్త అని ఆయన చెప్పారు.

‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంకా అనేక విషయాలపై మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)