You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ లాక్ డౌన్: మీరు ఏ జోన్‌లో ఉన్నారు, ఏం చేయవచ్చు?
లాక్‌డౌన్ మరోసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో నిబంధనలతో కూడిన సడలింపులకు అనుమతినిచ్చింది. ఆయా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి, ఆ జోన్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలో, ఏయే దుకాణాలు, కార్యకలాపాలకు అనుమతి ఉంటుందో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
అన్ని జోన్లలోనూ అనుమతి ఉన్నవి
- క్లినిక్‌లు, ఆస్పత్రులలో ఔట్‌పేషెంట్ విభాగాలు
- లిక్కర్, సిగరెట్, పాన్ షాపులు
- వ్యవసాయ కార్యక్రమాలు
- బ్యాంకులు, ఆర్థిక సంస్థలు
- పోస్టాఫీసులు, కొరియర్ సంస్థలు
- సరకు రవాణా వ్యవస్థలు
- సాధారణ దుకాణాలు, నిత్యావసరాలు సరఫరా చేసే ఈ-కామర్స్ వ్యాపార సంస్థల కార్యకలాపాలు
- పట్టణ ప్రాంతాల్లో ఆన్‌సైట్ నిర్మాణ పనులు
- ఫోర్ వీలర్ (1+2)
- సెల్ఫ్‌కంట్రోల్డ్ ఇండస్ట్రీలు, పట్టణప్రాంత పరిశ్రమలు
మూడు జోన్లలోనూ అనుమతి లేనివి ఇవే
- విమానం, రైలు, బస్సు, మెట్రో, అంతర్రాష్ట్ర ప్రయాణాలు
- స్కూళ్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మాల్స్
- ప్రార్ధనా స్థలాలు, సభలు, సమావేశాలు, వేడుకలు
- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు జనసంచారం
- 65ఏళ్ల పైబడిన వారు, పదేళ్లలోపు వారు, గర్భిణుల సంచారం
రెడ్‌జోన్‌లో వీటికి అనుమతి లేదు
- క్షౌరశాలలు , స్పాలు
- ఆటో, ట్యాక్సీ ప్రయాణాలు
- అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు
- టూవీలర్ (కేవలం ఒక్కరే)
- ఈ-కామర్స్, అత్యవసర సరుకులు కానివి
ఆరెంజ్ జోన్‌లో అనుమతి ఉన్నవి
- క్షౌరశాలలు, స్పాలు
- అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు (50శాతం)
- ఫోర్ వీలర్ (1+2)
- టూ వీలర్ (1+1)
- ఆటో అండ్ ట్యాక్సీ (1+1)
- నాన్‌కోర్ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు
గ్రీన్ జోన్‌లో అనుమతి ఉన్నవి
- అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు (50శాతం)
- ఫోర్ వీలర్ (1+2)
- టూ వీలర్ (1+1)
- ఆటో అండ్ ట్యాక్సీ (1+1)
- నాన్‌కోర్ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు
కంటైన్‌మెంట్ జోన్లలో...
- నిత్యవసర సరకులకు వెళ్లొచ్చు
- అత్యవసర వైద్యానికి వెళ్లొచ్చు
- వాహనాలకు తనిఖీలు జరుగుతాయి
- రాకపోకలు సాగించేవారి వివరాలు సేకరిస్తారు
ఆంధ్రప్రదేశ్ కోవిడ్-19 వ్యాప్తి ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
మే 5వ తేదీ నాటికి రాష్ట్రంలో 1717 కేసులు నమోదయ్యాయి. ఇందులో 34 మంది మరణించారు.
589 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 1,094 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ఏ జిల్లాలు ఏ జోన్‌లలో ఉన్నాయి?
రెడ్‌జోన్: చిత్తూరు, కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు
ఆరెంజ్ జోన్: శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, అనంతపురం
గ్రీన్‌జోన్: విజయనగరం
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి ఎలా ఉంది?
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య వెయ్యి దాటింది.
లాక్‌డౌన్ తొలగించకపోయినా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జన సంచారం పెరిగింది.
కంటైన్‌మెంట్ ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం కుదించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరానికి కేంద్ర బృందం రానుంది.
తెలంగాణలో ఏ జిల్లాలు ఏ జోన్‌లలో ఉన్నాయి?
రెడ్‌జోన్: హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట
ఆరెంజ్ జోన్: ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, నల్లగొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం
గ్రీన్ జోన్: పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, సిద్దిపేట, యాదాద్రి, వనపర్తి, నాగర్ కర్నూల్
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి.
- లాక్‌డౌన్ సడలింపు: ఏపీలో మద్యం షాపుల ముందు భారీగా క్యూలు... ఇతర దుకాణాలు తెరవడంపై గందరగోళం
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్‌డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?
- ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు
- కరోనావైరస్ లాక్‌డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)