భారత మహిళా క్రీడాకారులు ఇప్పటిదాకా ఎన్ని పతకాలు గెలిచారు?

1951 నుంచి జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ మహిళలు మొత్తం 698 పతకాలు గెలిచారు. నవంబర్ 5, 2019 వరకు సాధించిన పతకాలపై బీబీసీ పరిశీలన ప్రకారం భారతీయ మహిళా క్రీడాకారులు మొత్తం 201 స్వర్ణం, 240 రజతం, 257 కాంస్య పతకాలు గెలిచారు.

భారతీయ మహిళలు ఏ విభాగంలో అత్యధిక పతకాలు గెలిచారు?

ఆసియా వేసవి క్రీడల్లోనే మహిళలు ఎక్కువ పతకాలను సాధించారు. 1951 నుంచి భారతీయ మహిళా క్రీడాకారులు మొత్తం 206 పతకాలు సాధించారు. ప్రతి నాలుగేళ్లకోసారి ఆసియా వేసవి క్రీడలు జరుగుతాయి. 2014, 2018లో జరిగిన క్రీడల్లో భారత మహిళలు 67 పతకాలు గెలిచారు.

కామన్వెల్త్ క్రీడల్లో కూడా మహిళలు సత్తా చాటారు. 1978 కామన్వెల్త్ క్రీడల నుంచి వాళ్లు మొత్తం 160 పతకాలు సాధించారు. భారత మహిళలు ఇతర పతకాలతో పోలిస్తే స్వర్ణాలు ఎక్కువగా సాధించిన పోటీలు అవే. భారత మహిళలు కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 58 స్వర్ణం, 61 రజతం, 38 కాంస్య పతకాలు గెలిచారు.

సంవత్సరాల వారీగా పతకాల సరళిని చూడటానికి క్రీడా విభాగంపై క్లిక్ చేయండి.

ఏ క్రీడలో ఎక్కువ పతకాలు వచ్చాయి?

అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీలో భారత్‌కు ఎక్కువ పతకాలు వచ్చాయి. భారతీయ మహిళలు అథ్లెటిక్స్‌లో 156, షూటింగ్‌లో 137, రెజ్లింగ్‌లో 73 పతకాలు గెలిచారు. బ్యాడ్మింటన్‌‌లో 70, హాకీలో 10, ఆర్చరీలో 65, బాక్సింగ్‌లో 45 పతకాలతో ఆయా విభాగాల్లోనూ రాణించారు.

మెథడాలజీ

ఈ పట్టికను తయారు చేయడం కోసం అంతర్జాతీయ, జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ క్రీడాకారులు గెలిచిన పతకాల (స్వర్ణం, రజతం, కాంస్యం) సమాచారాన్ని బీబీసీ డేటా టీం విశ్లేషించింది. భారత మహిళలు మొదట 1951లో పతకాలు గెలిచారు, కాబట్టి ఆ సమాచారం 1951 నుంచి మొదలవుతుంది. అన్ని క్రీడలు, ఛాంపియన్ షిప్స్, ప్రపంచ కప్‌ల సమాచారం ఇక్కడ చూడొచ్చు. వీలైనన్ని పతకాలను ఇక్కడ పొందుపరచడానికి ప్రయత్నించాం. ఒకవేళ మేం ఏదైనా ఈవెంట్‌ను వదిలేసినట్టు అనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. దాన్ని కూడా ఇక్కడ చేర్చడానికి ప్రయత్నిస్తాం. క్రికెట్ పోటీల్లో పతకాలు ఇవ్వరు కాబట్టి ఆ క్రీడను ఇక్కడ చేర్చలేదు.

జట్టుగా ఆడే క్రీడల్లో, జట్టులోని ప్రతి సభ్యుని పేరు మీదా పతకాన్ని అందజేస్తారు. దానివల్ల మొత్తం పతకాల సంఖ్యలో ఎలాంటి తేడా రాదు. ఉదాహరణకు మహిళల జట్టు హాకీ పోటీలో గెలిస్తే జట్టు మొత్తానికి కలిపి ఒక్కటే పతకం వచ్చినట్లుగా పరిగణిస్తారు. కానీ, జట్టులో ప్రతి ఒక్కరికీ సమ ప్రాధాన్యం కల్పించేందుకు వారికి విడివిడిగా ఒక్కో పతకం అందజేస్తారు.

ఛాంపియన్‌షిప్‌ల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

విశ్లేషణ: షాదాబ్ నజ్మీ

డేటా సహకారం: ఆన్య అఫ్తాబ్

డెవలప్‌మెంట్: ఓలీ పాటిన్‌సన్, ధృవ్ నేన్వానీ

ఇన్ఫోగ్రాఫిక్: గగన్ నార్హే, నిఖితా దేశ్‌పాండే, పునీత్ బర్నాలా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)