BBC Indian Sportswoman of the Year-2019: మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేయండి...

బీబీసీ తొలిసారిగా 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

2019కిగానూ ఈ పురస్కారానికి ఐదుగురు క్రీడాకారిణులు నామినేట్ అయ్యారు.

వారే ద్యుతి చంద్ (అథ్లెటిక్స్), మానసి జోషి (పారా బ్యాడ్మింటన్), మేరీ కోమ్ (బాక్సింగ్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్) .

ఫిబ్రవరి 24, రాత్రి 11.30 గంటల వరకూ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.

అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి పేరును 2020 మార్చి 8న దిల్లీలో జరిగే కార్యక్రమంలో బీబీసీ ప్రకటిస్తుంది.

ఓటింగ్ ఫలితాలను బీబీసీ భారతీయ భాషలు, స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లలోనూ ప్రచురిస్తాం.

భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురు నామినీలను ఎంపిక చేసింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన నియమ నిబంధనలు, ప్రైవసీ నోటీసు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)