You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బడ్జెట్ 2020: కొత్త పన్ను శ్లాబులు కావాలంటే వీటిని వదులుకోవాల్సిందే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్‌లో ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త శ్లాబులను ప్రకటించారు. కాకపోతే ఇవి కావాలంటే పన్ను మినహాయింపులు వదులుకోవాలి. ఇదే సమయంలో పాత శ్లాబులు కూడా అమల్లో ఉంటాయి.
ఒకరకంగా చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులకు ఆర్థికమంత్రి రెండు మార్గాలు చూపించారు. ఒకటి పన్ను మినహాయింపులు వదులుకొని కొత్త శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించడం. రెండు పన్ను మినహాయింపులు పొందుతూ పాత శ్లాబుల ప్రకారం పన్నుకట్టడం.
కొత్త శ్లాబుల విధానాన్ని మీరు ఎంచుకుంటే ఈ కింది పన్ను మినహాయింపులను వదులుకోవాలి.
- లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ)
- హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్ఏ)
సెక్షన్-16
- స్టాండర్డ్ డిడక్షన్స్
- ఎంటర్‌టైన్మెంట్ అలవెన్స్
- ప్రొఫెషనల్/ఎంప్లాయిమెంట్ ట్యాక్స్
- సెక్షన్-24 కింద గృహరుణాల వడ్డీపై పన్ను మినహాయింపు
సెక్షన్-80సీ
- జీవిత బీమా ప్రీమియం
- స్కూల్ ట్యూషన్ ఫీజు
- ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్)
- నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్)
- పీపీఎఫ్
సెక్షన్-80డీ
- మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం
సెక్షన్-80డీడీ, 80డీడీబీ
- వికలాంగులకు పన్ను ప్రయోజనాలు
సెక్షన్-80ఈ
- విద్యారుణాలపై చెల్లించే వడ్డీలకు పన్ను మినహాయింపు
సెక్షన్-80జీ
- స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలు
పన్ను మినహాయింపులు కావాలనుకుంటే ఇప్పటికే ఉన్న శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా
- కునాల్ కమ్రాను నిషేధించిన ఎయిర్లైన్స్.. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి
- India vs New Zealand: వరుసగా రెండో టై.. నాలుగో టీ20లోనూ సూపర్ ఓవర్లో భారత్ విజయం
- కరోనావైరస్ను అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)