You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు 'ఫ్రీ'
- రచయిత, ఎం. నియాస్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మొబైల్ ఫోన్లు కొంటే ఉచితంగా ఇచ్చే ఆఫర్లు ఏముంటాయి?
మహా అయితే.. హెడ్‌ఫోన్లు, టెంపర్డ్ గ్లాస్, మెమొరీ కార్డులు. అయితే.. తంజావూరు జిల్లాలోని ఒక మొబైల్ షాపు యజమాని కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు.
ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితం అని ఆఫర్ ప్రకటించారు.
ఆశ్చర్యంగా ఉందా? 'ఉల్లిపాయలు ఉచితం' ఆఫర్ వల్ల తన అమ్మకాలు అమాంతం ఐదు రెట్లు పెరిగాయని సదరు షాపు యజమాని చెప్తున్నాడు.
తమిళనాడులోని డెల్టా ప్రాంతమైన తంజావూరు జిల్లాలో పట్టుకొట్టాయ్ వాచ్‌టవర్ దగ్గర ఉంది ఎస్.టీ.ఆర్. మొబైల్ షాప్. ఈ దుకాణంలో గత రెండు రోజులుగా 'ఉచిత ఉల్లిపాయల' ఆఫర్ అందిస్తున్నారు.
''మా ఆవేదనను వ్యక్తం చేయటం మాత్రమే ఈ ఆఫర్ ఉద్దేశం'' అని యజమాని శ్రావణకుమార్ చెప్పారు.
ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు ఎగబాకాయని ఆయన ఉటంకించారు. ''మెమొరీ కార్డు కూడా అదే ధరకు లభిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలకు.. మమొరీ కార్డు, హెడ్‌ఫోన్ల కన్నా ఉల్లిపాయలు ఎక్కువ అవసరం. అందుకే మేం ఈ ఆఫర్ ప్రారంభించాం'' అని వివరించారు.
ఇంతకుముందు సగటున రోజుకు రెండు లేదా మూడు ఫోన్లు అమ్మేవాళ్లు. ఉల్లిపాయల ఆఫర్‌తో ఈ షాపు వ్యాపారం ఐదు రెట్లు పెరిగింది.
''గడచిన రెండు రోజుల్లో 15 మొబైల్ ఫోన్ల కన్నా ఎక్కువ అమ్ముడయ్యాయి'' అని శ్రావణకుమార్ తెలిపారు.
నింగినంటుతున్న ఉల్లి ధరలు
తమిళనాడు వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కిలో 200 రూపాయలకు చేరాయి.
ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. సాధారణంగా ఐదు కిలోల ఉల్లిపాయలు కొనే వినియోగదారులు ఇప్పుడు కేవలం రెండు కిలోలు కొంటున్నారని మధురైకి చెందిన మూర్తి అనే విక్రేత చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఉల్లిపాయ చరిత్ర, రాజకీయాలు
- ధరల క్యాలికులేటర్: మన్మోహన్ ప్రభుత్వం నుంచి మోదీ ప్రభుత్వం వరకూ ధరలు ఎలా మారాయి?
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా?
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)