ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లో నిరసనలు.. అలాంటిదేమీ లేదన్న ప్రభుత్వం

ఆర్టికల్ 370 సవరణతో జమ్మూ, కశ్మీర్‌కున్న ప్రత్యేక హోదా రద్దు కావడం... శ్రీనగర్‌లో నిరసనలకు దారితీసింది. వందలాది మంది కశ్మీరీలు శుక్రవారం ప్రార్థనల అనంతరం వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలిపారు.

మరోవైపు, శ్రీనగర్‌, బారాముల్లాల్లో చిన్న చిన్న ప్రదర్శనలు జరిగాయి కానీ, 20 కన్నా ఎక్కువ మంది పాల్గొన్న నిరసనలేవీ జరగలేదని భారత ప్రభుత్వం చెబుతోంది.

శుక్రవారం నాడు శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో వందలాది కశ్మీరీలు భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు.

భద్రతా దళాల చర్యల్లో కొంతమంది గాయపడ్డారు.

ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారనే దానిపై స్పష్టత లేదు.

'ఆర్టికల్ 370 రద్దును మేం అంగీకరించం.. జమ్మూ, కశ్మీర్‌' అని రాసి ఉన్న బ్యానర్‌లను నిరసనకారులు ప్రదర్శించారు.

‘అంతా ప్రశాంతం.. ఎలాంటి కాల్పులూ జరగలేదు’- కశ్మీర్ ఐజీపీ ఎస్పీ పని

కశ్మీర్ లోయ గత వారం రోజులుగా ప్రశాంతంగా ఉందని కశ్మీర్ ఐజీపీ ఎస్పీ పని ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. కాల్పులు జరిగాయని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయని, ఆ కథనాలు తప్పని, అలాంటి సంఘటనలేమీ జరగలేదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)