You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 12 మంది మృతి
ముంబయిలోని డోంగ్రీ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఈరోజు ఉదయం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు సహా 12 మంది చనిపోయారని డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ (DMCR) అధికారికంగా ప్రకటించింది.
మరో ఎనిమిది మంది జేజే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురు మహిళలు. హబీబ్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఏడాదిన్నర వయసున్న బాలుడు క్షేమంగా డిశ్చార్జి అయ్యాడు.
శిథిలాల మధ్య 30 మందికి పైగా చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు.
భవనం కూలడం వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, వందేళ్ల కాలం నాటి ఈ పురాతన భవనం తాజాగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిని ఉంటుందని భావిస్తున్నారు.
బిల్డింగ్ కూలిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఇతర భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయని బీబీసీ ప్రతినిధి జాన్వీ మూలే తెలిపారు.
ప్రస్తుతం భవనం కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
బిల్డింగ్ శకలాల కింద 15 కుటుంబాలకు చెందిన ప్రజలు ఉన్నారని భావిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఈ భవనం వందేళ్ల కాలం నాటిదని, ప్రస్తుతం శకలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే అంశంపై దృష్టి పెట్టామని, భవనం కూలిపోవడంపై విచారణ జరుపుతామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- కేరళ: ఈ వానా కాలాన్ని దాటేది ఎలా? గతేడాది వరదల నుంచి పాఠాలు నేర్చుకుందా?
- యూరప్, అమెరికాలో ఆశ్రయం కోసం ప్రజలు ఎందుకు వెళుతున్నారు?
- ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టు ఇదే, టీమిండియా నుంచి ఇద్దరికి చోటు
- లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ‘బిగ్ బాస్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)