You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డ్రగ్స్‌పై పంజాబ్ పోరాటం ఎంత వరకు వచ్చింది?
- రచయిత, అర్వింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్నేళ్లుగా పంజాబ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల సమస్య పట్టి పీడిస్తోంది. అధికారంలోకొచ్చే ప్రతి పార్టీ కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉంటున్నాయి. ఎన్నికలొచ్చే ప్రతి సారీ ఎక్కువగా వార్తల్లోకొచ్చేది ఈ మాదక ద్రవ్యాల అంశమే.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ డ్రగ్స్ అంశం వార్తల్లో నిలిచింది. డ్రగ్స్ సమస్య ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.
పంజాబ్‌లో లూధియానా జిల్లాలోని బేట్ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా మత్తుపదార్థాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ మత్తు పదార్ధాలను అమ్మేవాళ్లకు, కొనే వాళ్ళకు ఎప్పుడూ కొరత ఉండదని చెబుతుంటారు స్థానికులు.
డ్రగ్స్ బాధిత కుటుంబాల్లో మాల్సియన్ బజాన్ గ్రామానికి చెందిన గుర్‌దీప్ సింగ్ కుటుంబం ఒకటి.
ఆయన కుమారుడు జనవరిలో డ్రగ్స్ వల్లే చనిపోయాడు. అప్పుడు అతడికి 19 ఏళ్లు.
"మాదక ద్రవ్యాల కారణంగానే వాడు చనిపోయాడు. తరచూ ఇంజెక్షన్లు తీసుకునేవాడు" అని గుర్‌దీప్ బీబీసీతో చెప్పారు.
మాదక ద్రవ్యాల సమస్యను విజయవంతంగా తగ్గించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది.
మత్తుమందులపై యుద్ధం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్తున్నారు.
ఇప్పటికే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న దాదాపు 26 వేల మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్తున్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు మాదక ద్రవ్యాలను కొనడం కాస్త కష్టంగా మారినప్పటికీ అవి ఇంకా అందుబాటులోనే ఉన్నాయని బీబీసీ పరిశోధనలో తేలింది. ఇప్పటికీ ప్రజలు మాదక ద్రవ్యాలను వాడుతూనే ఉన్నారు.
డ్రగ్స్ సమస్యను అరికట్టామని ప్రభుత్వాలు చెప్పే మాటల్లో నిజం లేదన్నది గుర్‌దీప్ మాట.
ఇవి కూడా చదవండి:
- అయిదోసారీ ఆడపిల్లే పుట్టిందని భార్యను చంపేశాడు
- పంజాబ్ మత్తుకు.. ఫుట్‌బాల్ మందు
- మోదీ దత్తత తీసుకున్న 'వారణాసి'లోని గ్రామాల పరిస్థితి ఎలా ఉంది?
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: ‘క్షమాపణ" నిరర్థకమన్న అలనాటి బాధితుడి వారసుడు
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా.. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకున్నారా?
- గాడ్సే.. హంతకుడా లేక తీవ్రవాదా? కమల్ హాసన్ వ్యాఖ్యలపై చర్చ
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)