గడ్చిరోలిలో పోలీసు వాహనంపై మావోయిస్టుల దాడి: 16మంది మృతి

మహారాష్ట్రలో బుధవారం పోలీసు కాన్వాయ్‌పై మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 16 మంది మరణించారు.
గడ్చిరోలి ప్రాంతంలోని జంబుర్ఖెడాలో సీ-60 దళం కాన్వాయ్‌పై నక్సలైట్లు ఐఈడీతో ఈ దాడికి పాల్పడ్డారు.
ఏప్రిల్ 30 అర్థరాత్రి కుర్ఖేదా తాలూకాలోని దాదాపూర్ గ్రామ సమీపంలోని హైవేపై రహదారి నిర్మాణ సంస్థకు చెందిన ఓ మిక్సర్ ప్లాంటుతో సహా దాదాపు 30 వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకునే సమయంలోనే ప్రస్తుత దాడి జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"మావోయిస్టుల దాడికి తగిన ప్రతి దాడులకు మేం సిద్ధంగానే ఉన్నాం. మృతుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ఘటనా స్థలంలో అవసరమైన చర్యలు తీసుకున్నాం" అని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైశ్వాల్ తెలిపారు.

మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"భద్రతా సిబ్బందిపై గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలకు మా వందనాలు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేం. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి దాడులకు తెగబడిన వారిని వదిలిపెట్టం" అని మోదీ ట్విటర్‌లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"మావోయిస్టులు చేసిన దాడిలో గడ్చిరోలిలోని సీ-60 దళానికి చెందిన 16 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియచేస్తున్నా. డీజీపీ, గడ్చిరోలి ఎస్పీతో సంప్రదిస్తున్నాం" అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"గడ్చిరోలిలో పోలీసు వాహనంపై మావోయిస్టుల దాడి ఓ పిరికిపంద చర్య. పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను చూసి మేం గర్విస్తున్నాం. వారి మహోన్నత త్యాగాలు వృధా కానివ్వం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి" అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడి ప్రభుత్వానికి అవసరమైన సహాయం అందిస్తున్నామని రాజ్‌నాథ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులపై మావోయిస్టుల దాడి వార్త తెలిసి చాలా బాధపడుతున్నా. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం" అని కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమం రద్దైనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నక్సల్ దాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సీ-60 కమాండో దళం అంటే..
మావోయిస్టుల గెరిల్లా పోరాటాలను తిప్పికొట్టేందుకు మహారాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దళం ఇది.
స్థానిక తెగలకు చెందినవారిని ఇందులో చేర్చుకున్నారు.
1992లో ఈ ప్రత్యేక దళంలో స్థానిక తెగలకు చెందిన 60 మందికి స్థానం కల్పించారు.
నెమ్మదిగా ఈ దళం బలం పెరుగుతూ వచ్చింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా దళం ఆపరేషన్లూ పెరిగాయి.
దళంలోని తెగల వారికి స్థానిక పరిస్థితులు, భాష, సంస్కృతిపై అవగాహన ఉండటం వల్ల గెరిల్లా దాడులను ఎదుర్కోవడంలో వారు సఫలమయ్యారు.
2014, 2015, 2016ల్లో సీ-60 కమాండోలు జరిపిన పలు ఆపరేషన్లు విజయవంతమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)