You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్: ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు సంపూర్ణ మద్దతు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అడ్డు పడలేదని అన్నారు.
వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... చంద్రబాబు లాంటి రాజకీయ నేతలతో తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమకెలాంటి గొడవా లేదన్నారు.
"చంద్రబాబు నాయుడు నన్ను రోజూ తిడుతున్నారు. నిన్న, మొన్న ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు శాపాలు పెడుతున్నారు. అసలు సంగతి ఏంటంటే, ఆయన ఈసారి డిపాజిట్లు రాకుండా ఓడిపోబోతున్నారు. ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన కహానీ ఖతమైపోయింది.
నా దగ్గర సర్వే రిపోర్టు ఉంది. టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు మా మేలు మేము కోరుకుంటూనే, ఇతరుల మేలు కూడా కోరుకుంటాం. చంద్రబాబు లాగా చీకటి పనులు మేం చేయం. చంద్రబాబు లాంటి కుట్రలు మాకు రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కుండబద్ధలు కొట్టి చెబుతున్నాను. ఈ విషయాన్ని అనేకసార్లు మా ఎంపీలు లోక్‌సభలో చెప్పారు. నేను కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం.
మాకున్న సమాచారం ప్రకారం, తెలంగాణలో మేము 16 ఎంపీ స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తారు. టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి 35, 36 ఎంపీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా ఎంపీలు మద్దతు ఇస్తారు." అని కేసీఆర్ అన్నారు.
పోలవరానికి సంపూర్ణ సహకారం
"మేము పోలవరం ప్రాజెక్టుకు ఎన్నడూ అడ్డుకోలేదు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం అందిస్తాం. ఎందుకంటే, గోదావరిలో నీళ్లు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ ఏడాది కూడా 2,600 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. అలా వృథాగా పోయే నీటిని మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. నదీ జలాల్లో మా వాటా మాకు రావాలి. మా పొలాలు పారాలి. మాతో పాటు, మీరు కూడా బతకాలని కోరుతున్నాం. మీలాగా రాజకీయాల కోసం అబద్ధాలు ఆడేవాళ్లం కాదు" అని కేసీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- శ్రీసిటీ సెజ్: పల్లె జీవితాల్లో వెలుగులు.. మహిళల సాధికారతకు పట్టం
- జనసేన, వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలు ఏ వర్గాలకు ఏ హామీలిచ్చాయి...
- పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ: 'మేం ఎవరికీ మద్దతు ఇవ్వం... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది?- బీబీసీ క్విజ్
- ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- Fact Check: వయనాడ్లో రాహుల్ గాంధీ నిజంగానే పాక్ జెండాను ఎగరేశారా....
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- ‘ఈ పని చేయడం నాకిష్టం లేదు... కానీ, మరో దారి లేదు’
- జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయి?
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)