బ్రెజిల్ మెచ్చిన ఒంగోలు గిత్తలు
అది 1868. భారతదేశం నుంచి ఇంగ్లండ్‌కు ఒక ఓడ బయలుదేరింది. విక్టోరియా మహారాణి కోసం పంపుతున్న కొన్ని బహుమతులు కూడా అందులో ఉన్నాయి. అనుకోకుండా ఆ ఓడ బ్రెజిల్ తీరానికి చేరుకుంది. విక్టోరియా మహారాణి కోసం పంపిన బహుమతులను అక్కడ అమ్మేశారు. ఆ బహుమతులే.. రెండు ఒంగోలు జాతి పశువులు.
ఆ విధంగా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం ప్రారంభమైంది. అవి అక్కడ అడుగుపెట్టి 2018 నాటికి సరిగ్గా 150 ఏళ్లు అవుతోంది.
ఈ పదిహేను దశాబ్దాల్లో ఎన్నో మార్పులు. రెండు పశువులతో వాటి ప్రయాణం మొదలై ఇప్పుడు కొన్ని కోట్లకు చేరింది. భారత ప్రభుత్వం 1962లో ఎగుమతులను నిషేధించే వరకు ఒంగోలు జాతి బ్రెజిల్‌కు తరలిపోతూనే ఉండింది.
పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ కోసం పోరాడుతున్న ఒంగోలు జాతి బ్రెజిల్‌లో ఎందుకు వెలుగులీనుతోంది?
చూడండి వీడియోలో..
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)