మూడు రోజుల పాటు ప్రసవ వేదన అనుభవించింది.. తనలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదనుకుంది

వీడియో క్యాప్షన్, 'ఈ చేతులతో వందమందికి ప్రాణం పోశా’

ఇప్పటికీ దేశంలోని వందల గ్రామాల్లో గర్భిణులు ప్రసవించాలంటే మంత్రసానులే ఆధారం. పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ అదే సమస్య.

అక్కడ హిమాలయ పర్వతాల్లోని ఒక గ్రామంలో షెర్బానో అనే ఒక మహిళ మూడు రోజుల పాటు ప్రసవ వేదన అనుభవించి చివరకు తనకు తానే కాన్పు చేసుకుంది.

తీవ్రమైన పురిటి నొప్పులతో ఉన్నప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది.

తనలా ఇంకెవరూ ఇబ్బందులు పడరాదని.. తమ గ్రామం చుట్టుపక్కల ఎవరికి కాన్పు చేయాలన్నా సాయపడాలని నిర్ణయించుకుంది.

షెర్బానో
ఫొటో క్యాప్షన్, షెర్బానో

ఇది జరిగి పదేళ్లవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అర్ధరాత్రి వేళ ఎవరైనా కాన్పు చేయడానికి పిలిచినా వెంటనే అక్కడ వాలిపోతుందామె.

అందుకే షెర్బానోను ఆ ప్రాంత ప్రజలంతా సూపర్ ఉమన్ అంటారు.

రక్తపోటు పరీక్షించే పరికరం.. మరికొన్ని అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకుంటుంది ఆమె.

ప్రసవానికి ముందే గర్భిణులకు ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి సలహాలు కూడా ఇస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)